3 April, 2026 | 8:14 PM

దొడ్డి కొమురయ్య పోరాటం చిరస్మరణీయం

03-04-2026 06:29 PM

– కోనరావుపేటలో విగ్రహావిష్కరణ

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని కమాన్ వద్ద శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ప్రాణం పోసిన మహనీయుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. సాయుధ పోరాట కాలంలో ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. నేటి యువతకు ఆయన పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని, అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తిన తొలి వీరుడిగా ఆయన చరిత్రలో నిలిచారని తెలిపారు. తెలంగాణ గడ్డపై అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని కోనరావుపేటలో ప్రతిష్టించడం అభినందనీయమని అన్నారు.