3 April, 2026 | 7:44 PM

గణపవరం గ్రామంలో ఎద్దుల పందేలు

03-04-2026 06:26 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలోని వరవర రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలను  సర్పంచ్ బి స్నేహ దుర్గయ్య శుక్రవారం ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎద్దుల యజమానులు తమ పశు సంతతిని పోటీల్లో పాల్గొనేందుకు తీసుకొనివచ్చారు.

16 సంవత్సరాల తర్వాత గ్రామంలో ఎద్దుల పందేలు జరుగుతుండడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. 6వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. ఆలయ చైర్మన్ ఇర్లా వరహాలరెడ్డి విజయలక్ష్మి, మాజీ ఎంపీటీసీ సింగారెడ్డి హిమబిందు సుమన్ రెడ్డి, బండి చిన కోటయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.