calender_icon.png 11 November, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోళ్లను వేగవంతం చేయండి

11-11-2025 12:00:00 AM

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

నిజామాబాద్, నవంబర్ 10 (విజయ క్రాంతి) :  కొనుగోలు కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బోధన్ మండలం బండార్ పల్లి లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని, కల్దుర్కిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సోమవారం సందర్శించారు. సోయాబీన్ సేకరణ కేంద్రంలో రైతుల నుండి సేకరించిన సోయాబీన్ నిల్వల నాణ్యతను పరిశీలించారు.

ఇప్పటివరకు ఎంత పరిమాణంలో సోయాబీన్ కొనుగోలు చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాలలో సోయాబీన్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.   17శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని రైతులు కేంద్రాలకు తెచ్చిన వెంటనే తూకం జరిపెంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర కాలయాపన కాకుండా, రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. కలెక్టర్ వెంట ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, మార్క్ ఫెడ్ డీ.ఎం మహేష్, బోధన్ తహసిల్దార్ విఠల్, కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.