11-11-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైం, నవంబర్ 10: కరీంనగర్ నగరంలోని శ్రీ రామ్ సాగర్ కాలనీ రోడ్ నం.5 వద్ద ఉన్న రాజిరెడ్డి కాలనీవాసులు డ్రైనేజ్ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు ఈ సమస్యను పరిష్కరించాలంటూ కరీంనగర్ కలెక్టర్ కు, కార్పొరేషన్ అధికారులకు విన్నవించారు. కాలనీలో సుమారు 200 గృహాలు ఉండ గా, వీటి నుండి వచ్చే డ్రైనేజ్ నీరు సరైన విధంగా వెళ్లకపోవడం వల్ల చెత్త, దుర్వాసన, దోమల సమస్యలు తీవ్రరూపం దాల్చాయి.
ముఖ్యంగా రోడ్ నం.5 నుండి రోడ్ నం.6, 7 వరకు డ్రైనేజ్ లైన్ పూర్తిగా మూసుకుపోవడంతో వర్షాకాలంలో నీరు ఇళ్లలోకి చేరే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.ప్రతి ఇంటి వద్ద డ్రైనేజ్ నీరు రోడ్డు మీదకు వస్తోందని, మున్సిపల్ అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా చర్య లు తీసుకోవడంలేదన్నారు. వెంటనే కొత్త డ్రైనేజ్ లైన్ వేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యపై అధికారులకు వినతిపత్రం అందజేశారు. డ్రైనేజ్ లైన్ లేని రోడ్లు 15-4-65/3 నుండి 15-4-100022 వరకు ఉన్నాయని, వీటిని పునరుద్ధరించాలంటూ పత్రంలో పేర్కొన్నారు. కాలనీవాసు లు అధికారులు తక్షణ చర్య తీసుకుని ప్రజలకు ఊరట కల్పించాలనికోరారు.