calender_icon.png 11 November, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి వద్ద ఆత్మహత్యాయత్నం

11-11-2025 12:00:00 AM

కరీంనగర్ క్రైం, నవంబర్10(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా గన్నేరువరం మం డలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన కంపెళ్లి రాములు కుటుంబం తమ భూమి వివాదంపై ఆత్మహత్య యత్నం కు పాల్పడ్డారు. తమకు చెందిన ఎనిమిది ఎకరాల భూమిని గత 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్నప్పటికీ, ఇటీవలి కాలంలో ఆ భూమి వేరే వ్యక్తుల పేరుతో పత్రాలు సిద్ధమయ్యాయని కు టుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ అన్యాయంపై తమకు న్యాయం చేయాలంటూ బా ధిత కుటుంబం సోమవారం కరీంనగర్లోని ప్రజావాణి కార్యాలయంలో ఆత్మహత్య య త్నం చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నె లకొంది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధితుల ను అడ్డుకుని ప్రాణాపాయం నుంచి రక్షించా రు. బాధితులు అధికారుల నిర్లక్ష్యం కారణం గా తాము ఈ దశకు చేరుకున్నామని, తమ భూమిపై న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామనిహెచ్చరించారు.