6 June, 2026 | 11:20 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

అర్బన్ నక్సలైట్లను వెంటనే యూనివర్సిటి నుంచి తరిమేయాలి

01-04-2026 04:34 PM

కరీంనగర్,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయ పీజీ మరియు పరిశోధక విద్యార్థులం గత వారం రోజులుగా విశ్వవిద్యాలయంలో అర్బన్ నక్సలైట్ల తిష్ట అనే వార్తలు మమ్మల్ని విశ్వవిద్యాలయ విద్యార్థులుగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. విశ్వవిద్యాలయ ప్రతిష్టను, విద్యా వాతావరణాన్ని ఈ అర్బన్ నక్సలైట్లు చెడగొడుతున్నారు. దీనివల్ల విశ్వవిద్యాలయ విద్యార్థులకు రావాల్సిన క్యాంపస్ ప్లేస్ మెంట్లు, ఇతర ఉద్యోగ అవకాశాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం కలదు.

కొంతమంది వారి యొక్క వ్యక్తిగత స్వార్థంతో విశ్వవిద్యాలయ ప్రతిష్టను నీరుగార్చే ఉద్దేశంతో డబుల్ పీజీలు చేస్తూ విశ్వవిద్యాలయ సిబ్బందిని, విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గతంలో  కొందరు నిషేధిత మావోయిస్టు సంస్థలలో పనిచేస్తూ శాతవాహన విశ్వవిద్యాలయంలో అనేక అలజడులను సృష్టించారు. మళ్లీ అదే విధమైనటువంటి అలజడులను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్టి అర్బన్ నక్సలైట్ల చర్యల వల్ల మా యొక్క తల్లిదండ్రులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు.

కావున అట్టి వ్యక్తి, వ్యక్తుల యొక్క అడ్మిషన్ రద్దు చేస్తూ, వాళ్ళకు సహకరించిన వ్యక్తులను అర్బన్ నక్సలైట్లుగా పరిగణించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారూ లేని యెడల రానున్న రోజుల్లో యూనివర్సిటీ ముట్టడికైనా వెనకాడ పోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాతవాహన విశ్వవిద్యాలయ పి హెచ్ డి  స్కాలర్ నైతం మహేష్ పిహెచ్డి స్కాలర్స్ బోడకుంట రమేష్, నైతం సాయి కృష్ణ, కుంజ వర్మతేజా తదితరులు పాల్గొన్నారు*