17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

వ్యవసాయ భూమి ధ్రువపత్రాలతో యూరియా పొందవచ్చు

17-02-2026 09:30 PM

జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్

మిర్యాలగూడ,(విజయక్రాంతి): సాగు చేస్తున్న అసైన్డ్, పోడు భూములకు సైతం 13బి, వన్ బి జిరాక్స్ కాపీలను ఉపయోగించుకొని ఆన్లైన్ ద్వారా యూరియా బుకింగ్ చేసి అవసరమైన యూరియాను పొందవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ అన్నారు. మంగళవారం దామరచర్ల మండలంలో ఇన్చార్జి ఏడిఏ ధీరావత్ సైదా నాయక్ తో కలిసి స్థానిక ఎరువుల షాపులను తనిఖీ చేశారు.

అనంతరం స్థానిక రైతు వేదిక వద్ద  రైతులకు ఆయన పలు సూచనలు చేస్తూ రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఉందని, యూరియా సరఫరా పై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని యూరియా కొరకు అంతర్జాలంలో బుక్ చేసుకుంటే యూరియా లభించే ప్రదేశంలో వాటిని పొందవచ్చన్నారు. యూరియా పారదర్శక వినియోగం కొరకే యూరియా యాప్ ప్రవేశపెట్టారని పంటలను సాగు చేసే రైతులు గ్రామ పాలన అధికారి వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి ఆన్లైన్లో యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా పొందవచ్చన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి రుషేం ద్రమణి, ఏఈఓ లు పార్వతి, అజ్మీరా సైదులునాయక్, ఫాక్స్ సీఈవో వెంకటరెడ్డి , రైతులు తదితరులున్నారు.