02-02-2026 12:56:36 AM
రంగారెడ్డి, ఫిబ్రవరి 1( విజయక్రాంతి): జిల్లాలోని రైతు సోదరులకు సాగు పనుల్లో ఊరటనిచ్చేలా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. యూరియా పంపిణీ ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ, పారదర్శకత కోసం ఇకపై యాప్ (App) ద్వారానే సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎరువుల కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు జిల్లావ్యవసాయ అధికారి ఉషా తెలిపారు.
రైతులు తమకు కావాల్సిన యూరియాను యాప్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవాలి. బుకింగ్ పూర్తయిన తర్వాత వచ్చే ’బుకింగ్ ఐడి’ (Booking Iౄ) ని సంబంధిత డీలర్ వద్ద చూపించి ఎరువులను పొందవచ్చు.గ్రామాల్లో వాలంటీర్ల సేవలురైతులకు బుకింగ్ ప్రక్రియలో ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ ఆదేశాల మేరకు డీలర్ల వారీగా, గ్రామాల వారీగా ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించారు.
రైతులు తమ ఇంటి వద్ద నుంచే ఈ వాలంటీర్ల సహాయంతో యూరియాను బుక్ చేసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించింది.డీలర్ వద్ద యూరియా తీసుకోవడానికి బుకింగ్ ఐడి తప్పనిసరి.ఈ ప్రక్రియపై ఏవైనా సందేహాలు ఉన్నా లేదా ఇతర వివరాల కోసం రైతులు తమ పరిధిలోని మండల వ్యవసాయ అధికారులతో పాటు ఏఈఓ ల ను సంప్రదించాలని ఆమె కోరారు.