15 April, 2026 | 12:27 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

గుంపెళ్ళగూడెం జవాన్‌కు అవార్డు

02-02-2026 12:56 AM

కారేపల్లి, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): దేశ సరిహద్దులో ప్రజల భద్రతకు ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న  సశస్త్ర సీమాబల్(ఎసఎస్బీ) జవాన్‌గా పని చేస్తున్న కారేపల్లి మండలం గుంపెళ్ళగూడెంకు చెందిన దారావత్ వీరు అవార్డు అందుకున్నారు. వీధి స్థాయిలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన అందించిన నిష్ఠావంతమైన సేవలకు గుర్తింపుగా ప్రశంస పత్రం మరియు ప్రత్యేక పురస్కారంను ఆర్మీ అధికారులు అందజేశారు.

ఈసందర్బంగా గుంపెళ్లగూడెంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో  ఎసఎస్బీ జవాన్ దారావత్ వీరు సేవలను సర్పంచ్ గుగులోత్ కష్ణవేణి వీరునాయక్ కొనియాడారు. దేశరక్షణలో గుంపెళ్ళగూడెంకుచెందిన యువకులు ఎందరో భాగస్వాములుగా ఉన్నారని వారిత్యాగాలు వెలకట్టలేనివని, వారు గ్రామానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యోగ సంఘ ప్రతినిధులు గుగులోత్ శంకర్, బానోత్ వీరన్న, బానోత్ రమేష్ (ఆర్మీ) గ్రామ పెద్దలు గుగులోత్ వీర బాబు, లకావత్ రాము తదితరులు పాల్గొన్నారు.