మొదలైన యూరియా కష్టాలు
- యాప్‌లో నమోదు చేసినా దొరకని ఎరువులు
- కామారెడ్డి జిల్లా పద్మాజివాడిలో రైతుల నిరసన
కామారెడ్డి, జూన్ 8 (విజయక్రాంతి) : యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండ లం పద్మాజి వాడ చౌరస్తాలోని విండో కార్యాలయంలో సోమవారం ఉదయం తరలివచ్చారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆందోళన కు దిగారు. యాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు కూడా యూరియా అందుబాటు లో ఉండకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు.
సదాశివనగర్ మండలంలోని సదాశివనగర్, అడ్లూరు ఎల్లారెడ్డి, పద్మాజివాడి చౌర స్తా లాలోని విండో కార్యాలయాల వద్ద రైతు లు యూరియా కోసం ఉదయం నుంచి క్యూలో నిలబడ్డారు. అయినా లభించకపోవడంతో నిరసనకు దిగారు. సొ సైటీ చైర్మన్ సదాశివరెడ్డి అడ్లూరు ఎల్లారెడ్డి సింగిల్ విం డో వద్దకు వచ్చి యాప్‌లో నమో దు చేసుకున్న రైతులకు యూరియా సరఫరా చేసిన తర్వాతే ఇతర రైతులకు అందజేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.






