9 June, 2026 | 2:29 AM

2 లక్షల మందికి చేయూత పెన్షన్ల మంజూరు హామీ ఏమైంది?

09-06-2026 01:38 AM
  1. పెన్షన్స్ మంజూరు చేయాలని జూన్ 10న సెర్ప్ కార్యాలయం ముట్టడి
  2. ఎన్,పి,ఆర్, డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య

బోధన్, జున్ 8 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో 2 లక్షల మందికి చేయూత పెన్షన్స్ మంజూరు చేస్తామని, జూన్ 2న కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్స్ మంజూరు చేస్తామని ప్రకటించి, జూన్ 2న ఎందుకు పెన్షన్స్ మంజూరు చేయలేదని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRౄ)తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య ప్రశ్నించారు. సోమవారం రోజున వికలాంగుల హక్కుల జాతీయ వేదిక  విస్తృత సమావేశం రాకాసి పేట్ లో గ్రామాభివృద్ధి కమ్యూనిటీ హాల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా యం అడివయ్య మాట్లాడుతూ... 2023 డిసెంబర్ నెలలో జరిగిన ప్రజాపాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న 11రకాల చేయూత పెన్షన్స్ కోసం 24.85 లక్షల మంది దరఖాస్తూ చేసుకున్నారని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతుంది. దరఖాస్తులు చేసిన లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరుగుతున్న స్పందించడం లేదఅన్నారు. 2026 ఫిబ్రవరి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్స్ జూన్ 2 నాడు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.

ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన వలన లక్షలాది మంది చేయూత పెన్షన్స్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు మీ సేవా కార్యాల యల నుండి సర్టిఫికెట్స్ తీసుకుని దరఖాస్తూ చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త పెన్షన్స్ పంపిణి కోసం వెంటనే తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తుంది. జూన్ 10 న హైదరాబాద్ లో సెర్ప్ కార్యాలయంముట్టడిస్తున్నామని తెలిపారు.  జిల్లా అధ్యక్షులు గైని రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏషాల. గంగాధర్,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నజీర్,జిల్లా సహాయ కార్యదర్శి,ముంజం సాయిలు, జిల్లా కమిటీ,గాండ్ల గంగారం, ఆవుల సావిత్రి, శివ ప్రసాద్.. బుష్ గంపల, సంగప్ప, గంగారాం,పటేల్. సాయినాథ్.. జెల్లా అంజలి, ముత్యాలు. రజిత, కరుణ.. ఏ.షాల. గంగామని, ఏషాల ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు.