03-01-2026 04:29:26 PM
వాషింగ్టన్: వెనిజులాపై అమెరికా భారీ స్థాయిలో దాడి చేసిన తర్వాత ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో(Venezuelan President Maduro) పట్టుబడ్డారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(President Donald Trump) ప్రకటించారు. మదురో భార్యను కూడా పట్టుకుని దేశం వెలుపలికి తరలించారని ట్రంప్ తెలిపారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వెనెజువెలా రాజధాని కరాకస్ పై అమెరికా దాడులు చేసింది.
కరాకస్ లోని 7 ప్రాంతాలపై అమెరికా దాడులు చేసింది. డ్రగ్స్ అక్రమరవాణా విషయంలో ట్రంప్ వెనెజువెలాను లక్ష్యంగా చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాకు వెనెజువెలా అధ్యక్షుడు(Venezuelan President) మదురో సహకరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. అయితే, అధ్యక్షుడు మదురో, ఆయన భార్య ఆచూకీ గురించి తమ ప్రభుత్వానికి తెలియదని వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తర్వాత పేర్కొన్నారు. వారి ప్రాణాలతో ఉన్నట్లు రుజువు చూపాలని డిమాండ్ చేశారు. రాజధాని కారకాస్‌తో పాటు మిరాండా, అరగువా, లా గువైరా రాష్ట్రాలలో కూడా దాడులు జరిగాయని వెనిజులా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.