03-01-2026 04:36:15 PM
హైదరాబాద్: సీనియర్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (People's Liberation Guerrilla Army) కమాండర్, కీలక మావోయిస్టు నాయకుడు బర్సే దేవా(Barse Deva Surrenders ) శనివారం తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీ అత్యంత ప్రమాదకరమైన సాయుధ విభాగంగా పరిగణించబడే పీఎల్‌జీఏ బెటాలియన్ నెం. 1లో దేవా ఒక కీలక నాయకుడిగా ఉన్నాడు. ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఈ లొంగుబాటు ఒక ముఖ్యమైన పరిణామాన్ని సూచిస్తుందని పోలీసు అధికారులు తెలిపారు. బర్సే దేవాతో పాటు పలువురు మావోయిస్టులు శనివారం నాడు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.