03-01-2026 04:00:26 PM
కృష్ణా, గోదావరి జలాలు తప్ప వేరే టాపిక్ లేదా...
హైదరాబాద్: కృష్ణా జలాలపై తెలంగాణ శాసనసభలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ అసహనం వ్యక్తం చేశారు. అర్థరాత్రి వరకు ఎజెండా రావడం లేదని, షార్ట్ డిస్కషన్ దేనిపై ఉంటుందో తెలియడం లేదని మండిపడ్డారు. ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని, కృష్ణా, గోదావరి జలాలు తప్ప వేరే టాపిక్ లేదని అక్బరుద్ధీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎజెండా ఇవ్వకపోతే సభలో ఎలా ప్రిపేర్ అవుతారని, సభా హక్కులను స్పీకర్ కాపాడాలని అక్బరుద్ధీన్ ఒవైసీ పేర్కొన్నారు.