18 June, 2026 | 2:44 AM

ఇండో నుంచి ‘ఇండో’ తొలగింపు

18-06-2026 01:09 AM

అమెరికా రక్షణ శాఖ ధ్రువీకరణ

వాషింగ్టన్, జూన్ 17: ఇండో పసిఫిక్ ప్రాంతంలో పనిచేసే అగ్రరాజ్య సైనిక కమాండ్ పేరు నుంచి ‘ఇండో’ అనే పదాన్ని అమెరికా తీసివేసి, ‘యూఎస్ పసిఫిక్ కమాండ్’గా మార్చింది. అంతేగాక భారత చిత్రపటాన్ని కూడా మార్చి చూపించడం తీవ్ర వివాదాస్పదం అవుతుంది. బుధవారం జీ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భేటీ వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.

చారిత్రక మూలాలను గౌరవించడం, పసిఫిక్‌లో సేవలందించే సైనికుల్లో స్ఫూర్తి పెంపొందించేందుకు ఈ కమాండ్‌కు పాత పేరునే కొనసాగించాలని నిర్ణయించినట్లు అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. ఈ కమాండ్ ఎక్కడ పనిచేస్తుందనే దానిపై తమ వెబ్‌సైట్‌లో ఓ ఫోటోను కూడా ప్రదర్శించింది. అందులో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్తాన్ భూభాగంగా చూపించడం వివాదానికి దారితీస్తోంది. 1947 జనవరి 1న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్. ట్రుమ్యాన్ ఏర్పాటు చేశారు. 2018లో దీని పేరును ట్రంప్ ‘యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్’గా మార్చారు. హిందూ, పసిఫిక్ మహాసముద్రాల మధ్య అనుసంధానాన్ని గుర్తించి పేరులో ‘ఇండో’ చేర్చినట్లు రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ చెప్పారు.