15 March, 2026 | 8:24 AM

ఇరాన్ సుప్రీం లీడర్‌ను పట్టిస్తే రూ.93 కోట్లు

15-03-2026 01:28 AM

మొజ్తాబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా భారీ ఆఫర్

అలీఅస్గర్ హెజాజీ, అలీ లారిజానితో సహా పలువురిపైనా బహుమతి

వాషింగ్టన్, మార్చి 14: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆచూకీ చెప్పిన వారికి భారీ ఆఫర్ ప్రకటించిది అమెరికా. మొజ్తాబాను పట్టిస్తే 10 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ.93 కోట్లు) బహుమతిగా ఇస్తామని చెప్పింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ తన సోషల్ మీడియాలో ప్రక టించింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకరమైన యు ద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.

మొజ్తాబాతో పాటు అలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భ్రదతాధికారి అలీ లారిజానితో సహా పలువురు ఆచూకీ తెలిపితే తగిన బహుమతి ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఆచూకీ తెలిపిన వారికి బహుమతితో పాటు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అమెరికా మూకమ్మడి దాడిలో ఇరాన్ సుప్రీం నేత ఆయ తుల్లా అలీ ఖమేనీ హతమైన సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ వారసుడిగా ఖమే నీ ముజ్తాబా ఎన్నికయ్యారు. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మొజ్తాబా ఎక్కడున్నారో తెలియడం లేదు.

ప్రస్తుతం ఇరాన్ కీలక నాయకుల స్థానం గుర్తించడంలో అమెరికాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కీలక నేతలను గుర్తించి పట్టుకునే సామర్థ్యం లేకపో వడం వల్లే ప్రజల సహాయంతో సమాచారం సేకరించేందుకు బహుమతి ప్రకటించాల్సి వచ్చిందా అనే చర్చ జరుగుతోంది. యుద్ధం ప్రారంభమై రెండు వారాలు పూర్తవుతున్నప్పటికీ అమెరికా లక్ష్యాలు పూర్తి కాలేదని విశ్లేషకులు అంటున్నారు. అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ యుద్ధంలో నిర్ణాయక పురోగతి సాధించామని చెబుతున్నప్పటికీ స్పష్టమైన విజయం ఇంకా కనిపించడం లేదని పేర్కొంటున్నారు.