విధ్వంసం మొదలుకాలే
మా లక్ష్యంలో ఇరాన్ వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు
ఈ లోపే వారు ఒప్పందం చేసుకోవాలి
ప్రపంచంలోనే అమెరికా సైన్యం అత్యంత గొప్పది, శక్తిగలది
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
మీ వంతెనలనూ పేల్చేస్తాం
మా టార్గెట్‌లో గల్ఫ్‌లోని 8 బ్రిడ్జీలు: ఇరాన్
కరాజ్ బ్రిడ్జి కూల్చివేతకు ప్రతీకారమని వెల్లడి
లేఆఫ్స్ వేళ ఒరాకిల్‌ను టార్గెట్ చేసిన టెహ్రాన్
వాషింగ్టన్/టెహ్రాన్, ఏప్రిల్ 4: ఇరాన్‌లో ఇంకా విధ్వంసం మొదలు కాలేదని, మేం ఇరాన్ వంతెనలు, విద్యుత్ ప్లాంట్లను కూడా టార్గెట్ పెట్టుకుంటామని, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరిం చారు. ఆ దేశంలో భారీ వినాశనం జరగకముందే మేల్కొని మాతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని హితువు పలికారు. ఈ మేరకు శుక్రవారం ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన పోస్టు పెట్టారు. మరోపక్క ఇరాన్‌లోని కరాజ్‌లో అత్యంత్య పెద్దదైన బ్రిడ్జి కూల్చివేతకు ప్రతీకారంగా గల్ఫ్‌లోని 8 బిడ్జీలే లక్ష్యంగా ఐఆర్‌జీసీ దాడులు చేసేందుకు సిద్ధమైంది.
అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలై 35 రోజులైంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త తలు కొనసాగుతున్నాయి. అమెరికా సైన్యం ప్రపంచంలోనే చాలా గొప్పదని, అత్యంత శక్తివంతమైనదని ట్రంప్ తమ దేశ సైన్యానికి కితాబ్ ఇచ్చారు. తమ సైన్యం ఇంకా ఇరాన్‌లో మిగిలిన వాటిని సర్వనాశనం చేయ డం ప్రారంభించలేదని తెలిపారు. ఆ దేశంలోని వంతెనలు, తర్వాత విద్యుత్ కర్మాగా రాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఈ లోపే వారు ఒక ఒప్పందానికి రావాలని సూచించారు.
ఆ దేశంలో నూతన నాయకత్వానికి ఏం చేయాలో తెలుసని, దానిని త్వరగా ఆచరించాలని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇరాన్‌లో రానున్న వారా ల్లో అతిభీకర దాడులు జరుగుతాయని ట్రం ప్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరాన్‌లోని అత్యంత పెద్దదైన వంతెన లక్ష్యం గా దాడులు జరిగాయి. ఆ దాడి వీడియోను పోస్టు చేసిన ట్రంప్.. ఇరాన్ ఉనికిని కోల్పోకముందే ఒక ఒప్పందానికి రావాలని హెచ్చ రించారు. ఇదిలా ఉండగా ఇరాన్‌లోని కరాజ్‌లో అత్యంత్య పెద్దదైన బ్రిడ్జి కూల్చివేతకు ప్రతీకార దాడులకు ఐఆర్‌జీసీ సిద్ధమైంది. గల్ఫ్, జోర్డాన్‌లలోని 8 ప్రముఖ బ్రిడ్జీలను పేల్చేస్తామని ఐఆర్‌జీసీ శుక్రవారం తీవ్ర హెచ్చరికలు జారీచేసింది.
ఇజ్రాయెల్, అమెరికా దళాలు ఇరాన్‌లోని కరాజ్ ప్రాంతంలో ఉన్న అత్యంత ఎత్తున బీ1 బ్రిడ్జిని గురువారం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడుల్లో బీ1 బ్రిడ్జి పాక్షికంగా దెబ్బతింది. ఎనిమిది మంది పౌరులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులకు సిద్ధమైంది. గల్ఫ్, జోర్డాన్‌లోని 8 ప్రధాన బ్రిడ్జీలను ఐఆర్‌జీసీ టార్గెట్ చేసింది. ఈ మేరకు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఐఆర్జీసీ దాడులు చేయడానికి నిశ్చయించుకున్న బ్రిడ్జీల పేర్ల జాబితాను శుక్ర వారం విడుదల చేసింది.
ఇరాన్ హిట్ లిస్ట్‌లో ఉన్న గల్ఫ్, జోర్డాన్లోని కీలక బ్రిడ్జీలు ఈ విధంగా ఉన్నాయి. కువైట్‌లోని షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబాసీ బ్రిడ్జి, యూ ఏఈలోని షేక్ జాయెద్ బ్రిడ్జి, అల్ మఖ్తా బ్రిడ్జి, షేక్ ఖలీఫా బ్రిడ్జి, సౌదీఅరేబియా బహ్రెయిన్‌లోని కింగ్ ఫహద్ కాజ్‌వే బ్రిడ్జి, జోర్డాన్‌లోని కింగ్‌హుస్సేన్ బ్రిడ్జి, దామియా బ్రిడ్జి, అబ్దున్ బ్రిడ్జి ఉన్నాయి. మొత్తంగా కువైట్‌లో ఒకటి, యూఏఈలో మూడు, బహ్రెయిన్‌లో ఒకటి, జోర్డాన్‌లో మూడు బ్రిడ్జీలను లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరా న్ హెచ్చిరించింది. ఒరాకిల్ కంపెనీ తాజాగా భారీ సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించింది. ప్రపం చ వ్యాప్తంగా ఏకంగా 30 వేల మంది ఉద్యోగులను తొలగించింది.
ఒక్క ఇండియాలోనే 12 వేల ఉద్యోగాలు పోయాయని సమాచారం. మంగళవారం ఉదయం ఉద్యోగాలు తీసేస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్స్ వెళ్లా యి. ఇకపై స్వచ్ఛందంగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసే వారికి మంచి పరిహారం అందిస్తామని కూడా ఒరాకిల్ కంపెనీ ప్రకటించింది. ఈ తరుణంలో ఒరాకిల్‌ను ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. దుబాయ్‌లోని ఒరాకిల్ డేటా సెంటర్‌పై దాడులు చేస్తామని ప్రకటించింది. శుక్రవారం అమెజాన్‌తో పాటు ఒరాకిల్‌పై ఇరాన్ దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై దుబాయ్ మీడియా ఆఫీస్ స్పందించింది. ఒరాకిల్ హబ్‌పై దాడులు జరిగాయంటూ వస్తు న్న వార్తలు ఫేక్ అని వెల్లడించింది.




