తమిళనాడు బీజేపీ జాబితా విడుదల
మైలాపూర్ నుంచి మాజీ గవర్నర్ తమిళి సై పోటీ
27 మంది జాబితాలో బీజేపీ మాజీ చీఫ్ అన్నా మలైకి దక్కనిచోటు
చెన్నై, ఏప్రిల్ 3 (విజయక్రాం తి) : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ 27మంది అభ్య ర్థుల పేర్లను శుక్రవారం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సైకి మైలాపూర్ స్థానం దక్కింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ సత్తూర్ నుంచి పోటీ చేయనున్నారు.
అవనాశి స్థానం నుంచి కేంద్రమంత్రి ఎల్.మురుగన్, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వ నతి శ్రీనివాసన్ కోయంబత్తూరు (ఉత్తర) నుంచి, మోడక్కురిచి నుం చి కృతిక శివకుమార్, విలవన్ కోడ్ నుంచి ఎస్ విజయధరణిని, తళ్లి నుంచి నాగేష్ కుమార్, పద్మనాభపురం నుంచి పి. రమేష్, కోలచెల్ నుంచి టి. శివకుమార్, నాగర్ కో యిల్ ఎం.ఆర్.గాంధీ, రాధాపురం, ఎస్పీ. బాలకృష్ణన్, వాసుదేవనల్లూ రు (ఎస్సీ) అనంత అయ్యస్వామి, తిరుచెందూర్ కేఆర్‌ఎం. రాధాకృష్ణన్, రామనాథపురం జిబిఎస్‌కె. నాగేంద్రన్, మదురై సౌత్ ప్రొఫెసర్ రామ శ్రీనివాసన్, మనమదు రై(ఎస్సీ) పోన్ వి బాలగణపతి, తిరుపత్తూరు కేసీ తిరుమరన్, అ రంతంగి కవిత శ్రీకాంత్‌లు బరిలోకి దిగనున్నారు.
బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై(సింగం) పేరు జా బితాలో లేకపోవడం గమనార్హం. సీట్ల పంపకాలపై అన్నామ లై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అందుకే ఎన్నికల్లో పోటీకి దూరం గా ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. అ న్నామలైకి స్థానం కేటాయించి ఉం టే అది ఎఐఎడీఎంకే అగ్ర నాయకత్వానికి ఆగ్రహం తెప్పించి ఉండేద ని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్త ప్ర చారానికి అన్నామలైనే ప్రధానంగా ముందుంచి రాబోయే రోజుల్లో ఆయనను కీలకపాత్రలో బీజేపీ తీసుకోనుందనే టాక్ వినిపిస్తుంది.
త్రిముఖ పోరు..
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి 2026, ఏప్రిల్ 23న ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. మే4 కౌంటింగ్ ఫలితాలు విడుదల కానున్నాయి. తమిళనాడులో బీజేపీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడీఎంకే)తో కలిసి పోటీ చేస్తోం ది. పొత్తులో భాగంగా అన్నాడీఎంకే 169 సీట్లలో పోటీ చేయనుండగా, బీజేపీకి27 స్థానాలు దక్కాయి. అ న్బుమణి రామదాస్ నేతృత్వంలోని పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)కి 18 సీట్లు కేటాయించగా, టీటీవీ దినకరన్‌కు చెందిన అమ్మమక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) 11 స్థానాలను దక్కించుకుంది. కాగా తమిళనాడులో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది.




