విద్యుత్ సరఫరాలో ఏఐని వాడండి
- ఉమ్మడి 9 జిల్లాల్లో, జిల్లాకు రెండు చొప్పున మొత్తం 18 సోలార్ పవర్ ప్లాంట్లు
- సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): రా ష్ట్రంలో విద్యుత్ పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా, సరఫరాలో లోపాలను సరిదిద్దేందుకు ఏఐను సీఎం రేవంత్ రెడ్డి అధికా రులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్లోడ్ పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల న్నారు. హైదరాబాద్ మిన హా రాష్ట్రంలోని ఉమ్మడి 9 జిల్లాల్లో, జిల్లాకు రెండు చొప్పున మొత్తం 18 సోలార్ పవర్ ప్లాంట్లను సబ్ స్టేషన్ల పక్కనే నిర్మించాలని ఆదేశించారు. దీని కోసం నోడల్ అధికారులను నియమించాలన్నారు.
అలాగే, భారీ డాటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ అనుమతులను త్వరితగతిన మం జూరు చేయాలని చెప్పారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ మరియు వినియోగంపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. గృహ అవసరాల కోసం సోలార్ స్టవ్ ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని సీఎం సూచించారు.
పర్యావరణ హిత ఇంధన వనరులకు ప్రాధాన్యత ఇస్తూ, దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్య క్రమంలో అనుమతులు మంజూరు చేయాలని అధికారుల ను ఆదేశించారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కం)లో చేరికకు సంబంధించి ఉద్యోగులు, సిబ్బందిలో ఉన్న సందేహాలను, అపో హలను నివృత్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.






