calender_icon.png 18 September, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో ఉషా ఉతుప్ భర్త మృతి

10-07-2024 12:05:00 AM

ప్రముఖ గాయని ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ (78) గుండెపోటుతో మరణించారు. సోమవారం రాత్రి కోల్‌కతాలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీవీ చూస్తుండగా గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జానీ చాకో ఉతుప్ మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేరళలోని కొట్టాయంకు చెందిన జానీ చాకో ఉతుప్, చెన్నైలో విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగం కోసం కోల్‌కతాకు వెళ్లగా, 1969లో కోల్‌కతాలోని ఓ నైట్ క్లబ్‌లో ఉష ఇచ్చిన ప్రదర్శన ద్వారా వీరి మధ్య తొలి పరిచయం జరిగింది. జానీ.. ఉషకు రెండో భర్త. కాగా వీరికి సన్నీ, అంజలి అనే కుమారుడు, కుమార్తె సంతానం.