15 March, 2026 | 5:48 AM

నేడు ఉస్తాద్ ప్రీ-రిలీజ్ ఈవెంట్

15-03-2026 12:00 AM

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై మేకర్స్ శనివారం అధికారిక క్లారిటీ ఇచ్చారు. ఈవెంట్‌ని మేకర్స్ ఆదివారం యూసుఫ్‌గూడా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ ప్రకటించింది. ఉగాది కానుకగా మార్చి ౧9న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి శనివారం సాయంత్రం సినిమా ట్రైల ర్‌ను విడుదల చేసింది.

ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్  కనిపించారు.  పవర్ స్టార్ స్వాగ్, యాక్షన్, డైలాగ్ డెలివరీ అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తు న్నాడు. పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.