04-06-2025 10:39:26 PM
హనుమకొండ (విజయక్రాంతి): 2025-26 విద్యా సంవత్సరానికి హనుమకొండ జిల్లాలో ఉన్న 9 ప్రభుత్వ వెనుకబడిన తరగతుల ఫ్రీ మెట్రిక్ వసతి గృహాలలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు, 6 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలలో ఇంటర్ నుండి పి.జి వరకు వసతి గృహాలలో ప్రవేశాల కొరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు చెందిన విద్యార్థులు వెబ్ సైట్ : https:/bchostels.cgg.gov.in// ద్వారా తేదీ 30-6-2025 లోగా ఆన్లైన్ చేసుకోవలసినదిగా జిల్లా కలెక్టర్ తెలియజేయడమైనది. వసతి గృహాలలో ఖాళీల వివరాలకై సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఏ. రవికుమార్ ఫోన్ నెంబర్ 9948670705 ని సంబంధిత వసతి గృహ అధికారులను సంప్రదించగలరు.