14 March, 2026 | 4:25 PM

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

14-03-2026 03:13 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పల్లిమక్తా గ్రామంలో శనివారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. మూడు నెలల పైబడిన లేగ దూడలు, బర్రెలు, ఆవులు, ఎడ్లకు పశువైద్య శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిన్న అనూష – అనిల్ కుమార్, ఉపసర్పంచ్ వాసంపెల్లి శ్రీనివాస్, గ్రామ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మండల పశు వైద్య అధికారి డా. సాహితి ఆధ్వర్యంలో పశు వైద్య సిబ్బంది కనకలక్ష్మి, శేఖర్, తిరుపతి రెడ్డి సేవలు అందించారు. అలాగే గోపాలమిత్రలు దినేష్, శ్రీకాంత్ పాల్గొని గ్రామంలోని పశువులకు టీకాలు వేయడంలో సహకరించారు. పశువులను గాలికుంటు వ్యాధి నుండి రక్షించేందుకు రైతులు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని అధికారులు సూచించారు.