14 March, 2026 | 4:36 PM

బండి యాత్రపై తేనెటీగల దాడి

14-03-2026 03:17 PM

కరీంనగర్,(విజయక్రాంతి): మండుటెండలో కార్యకర్తల హోరులో కొనసాగుతున్న బండి సంజయ్ జోరు. కరీంనగర్  జిల్లా రామడుగు మండలంలో జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో అడుగుల వేగాన్ని తగ్గించిన కేంద్ర మంత్రి. అయితే రామడుగు మండలం కోన్ రావుపేట సమీపంలో పెద్ద ఎత్తున నడుస్తున్న కార్యకర్తల జోష్ ద్రుశ్యాలను చిత్రీకరించేందుకు డ్రోన్ ఎగరేయడంతో అక్కడే చెట్టుపైనున్న తేనెతుట్టెను తాకడంతో తేనెటీగలు బయటకు రావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. కొందరు కార్యకర్తలపై తేనెటీగల దాడి చేయడంతో అప్రమత్తమైన బండి సంజయ్ గాయపడ్డ కార్యకర్తలకు డాక్టర్ల చే చికిత్స చేయించారు. కొద్ది దూరం వెళ్లి చెట్టు కింద సేదదీరిన బండి సంజయ్ కి వైద్యులు రొటీన్ చెకప్  చేశారు.