సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో ఎంతో నేర్చుకున్న
దేవుని గుట్ట తండా సర్పంచ్ గుగులోతు స్వాతి భాస్కర్ నాయక్
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన మొదటి దశ శిక్షణ కార్యక్రమంలో తుంగతుర్తి మండలం లోని సర్పంచులు పాల్గొని చక్కగా క్లాసులు విని ఎంతగానో నేర్చుకున్నామని దేవుని గుట్ట తండా సర్పంచ్ గుగులోతు స్వాతి భాస్కర్ నాయక్ అన్నారు.
అనంతరం సంబంధిత అధికారులతో కలిసి విజయవంతంగా సర్టిఫికెట్ అందుకున్నారు. గ్రామ అభివృద్ధి. పారదర్శక పాలన. ప్రజా సమస్యల పరిష్కారం. ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై నిపుణులు మార్గదర్శనం చేశారు. ఈ శిక్షణ ద్వారా గ్రామ పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన జ్ఞానం. నైపుణ్యాలు పొందినట్లు సర్పంచ్ స్వాతి తెలిపారు. దీనితో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.




