08-09-2025 01:36:38 AM
వందశాతం సమర్థతతో ‘ఎంటెరోమిక్స్’ టీకా తయారు చేసిన రష్యా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: మానవాళిని గజగజలాడిస్తూ పెనుసవాల్ విసురుతున్న క్యాన్సర్ వ్యాధికి త్వరలోనే వ్యాక్సిన్ రానుంది. క్యాన్సర్ వ్యాధిని వందశాతం నివారించే వ్యాక్సిన్‌ను తయారు చేసినట్టు రష్యా ప్రకటించింది. సూది మందు రూపంలో ఉండే ఈ వ్యాక్సిన్‌ను త్వరలోనే విపణిలోకి విడుదల చేయనుంది. అత్యంత భయానకమైన క్యాన్సర్ వ్యాధికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. క్యాన్సర్ రోగుల కోసం ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ తయారు చేసినట్టు రష్యా పేర్కొంది.
ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ (ఎఫ్‌ఎంబీఏ) ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ప్రీ క్లినికల్ పరీక్షల్లో కూడా ఈ వ్యాక్సిన్ ఉత్తీర్ణత సాధించిందని ఎఫ్‌ఎంబీఏ చీఫ్ వెరోనికా స్వోర్ట్సోవా తెలిపారు. రష్యన్ వార్తా సంస్థ టీఏఎస్‌ఎస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని వెల్లడించింది. ప్రస్తుతం మొదటి దశ పరీక్షలే విజయవంతమయ్యాయి.
వందశాతం సమర్థతతో..
ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో వందశాతం సమర్థతతో పని చేసినట్టు తెలు స్తోంది. శరీరంలో ఉండే పెద్ద, పెద్ద ట్యూమర్‌ల పరిమాణాన్ని కూడా ఈ వ్యాక్సిన్ తగ్గించిందని, వాటిని నాశనం చేసిందని వెల్లడైంది. ఆరోగ్య శాఖ నుంచి ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం లభించగానే పేషంట్లకు అందించనున్నారు. సాంప్రదాయబద్ధ చికిత్సలైన కీమోథెరపీ, రేడియేషన్‌లా కాకుండా ఈ ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేయనుంది.
క్యాన్సర్‌కు చికిత్స అంటే ప్రస్తుతం ఖర్చుతో పాటు మనుషుల శరీరాలపై కూడా పెద్ద ప్రభావమే పడుతోంది. కానీ ఈ ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ వల్ల అవేమీ లేకుండానే క్యాన్సర్‌ను నయం చేసుకోవచ్చునని తెలుస్తోంది. ఎటువంటి హాని కలిగిం చని నాలుగు రకాల వైరస్‌లు ఈ వ్యాక్సిన్‌లో ఉండనున్నాయి. 2025 మధ్యలో ఈ వ్యాక్సిన్ ప్రిక్లినికల్ పరీక్షలు ప్రారంభం కాగా.. ఉత్తమ ఫలితాలు వచ్చాయి.
కరోనా సమయంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను రూ పొందించిన మాస్కోలోని గామాలెయా సెంటర్ ఈ వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేసింది. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ కోసం 48 మంది వలంటీర్లను నియమించుకోగా.. వారిలో ఎవరికీ ఎటువంటి సైడ్ ఎఫె క్ట్స్ రాలేదు. వలంటీర్లతో పాటు జంతువుల మీద కూడా వ్యాక్సిన్‌ను పరిశోధించారు. జంతువులలో కణతులను తగ్గించడం వంటి సానుకూల ఫలితాలను ఈ వ్యాక్సిన్ చూపిం ది.
ప్రాథమిక దశలో వ్యాక్సిన్ భద్రతా, అది ఎలా పని చేస్తుందనే విషయాల మీద దృష్టి పెట్టారు. రెండు, మూడో దశల ఫలితాలు వస్తే అసలు ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేస్తుందా లేదా అనే విషయాలు మరిం త స్పష్టంగా తెలియనున్నాయి. ఇందుకోసం మరింత సమయం అవసరం. క్యాన్సర్‌కు ఈ వ్యాక్సిన్ ఎలా సరిపోతుంది అనే దానిపై విస్తృత పరిశోధనలు అవసరం. ఇది ఒకరకమైన ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత చికిత్సా పద్ధతి.
రోగి కణతి కణాల ఆధారంగా ఒక్కో రోగికి ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తారు. రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయితే ఈ వ్యాక్సిన్ విపణిలోకి వచ్చి క్యాన్సర్ చికిత్సా రంగంలో ఒక నూ తన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
కీమోథెరపీ చేసినా వ్యాధి నయం కాని వారికి ఈ వ్యాక్సిన్‌ను ఉపయోగించి వ్యాధిని నయం చేయొచ్చు. కీమో థెరపీ చేయడం వల్ల చాలా మందికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కీమోథెరపీ చికిత్సను తట్టుకోలేని వారికి ఈ వ్యాక్సిన్ మరింత ప్రయోజనకరంగా ఉండనుంది. మొదటిదశ క్లినికల్ పరీక్షల్లో విజ యాలు సాధించినా కానీ తర్వాతి పరీక్షల్లో విఫలమైనన పరిశోధనలు చాలా ఉన్నాయి.