calender_icon.png 8 September, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

860 గ్రాములతో శిశువు జననం

03-09-2025 12:00:00 AM

రక్షించిన శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ వైద్యులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ వైద్య బృందం అరుదైన విజయం సాధించింది. కేవలం 28 వారాల గర్భధారణకే 860 గ్రాముల బరువుతో జన్మించిన శిశువును విజయవంతంగా చికిత్స చేసి, ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేసింది. ఎస్‌ఎస్‌సహెచ్‌హెచ్ నిజాంపేట్‌లో ఎమర్జెన్సీ రూంలో పుట్టిన శిశువును అత్యంత క్లిష్ట పరిస్థితిలోనే మొదటి రోజే కొండాపూర్‌లోని బ్రాంచీకి తరలించారు.

పసికందుకు తీవ్రమైన ఇన్ఫెక్షన్, షాక్, శ్వాసకోశ వైఫల్యం వంటి సమస్యలు ఉండటంతో వెంటిలేటర్ సపోర్ట్ అవసరమైంది. ఇన్క్యుబేటర్లో ఉంచి అత్యవసర వైద్య సంరక్షణ అందించారు. ఆధునిక యాంటీబ యాటిక్స్, ఊపిరితిత్తుల కోసం సర్ఫాక్టంట్ థెరపీ, గుండె స్థిరీకరణ కోసం మందులు వాడటం ద్వారా పసికందు పరిస్థితి క్రమం గా మెరుగుపడింది.

మెకానికల్ వెంటిలేషన్ నుంచి మొదలుకొని, నాన్-ఇన్వేసివ్ వెంటిలేషన్, ఆపై హై-ఫ్లో నాజల్ కాన్యులా, చివరికి సహజ శ్వాస (రూం ఎయిర్) వరకు దశలవారీగా తగ్గించారు. ఆసుపత్రి ఉన్నంత కాలంలో మూడుసార్లు పసికందుకు జాండి స్ వచ్చింది. కానీ సమయానికి ఇంటెన్సివ్ ఫోటోథెరపీ ఇవ్వడం ద్వారా పూర్తిగా కోలుకుంది. ముఖ్యంగా, బ్రాంకోపల్మనరీ డిస్ప్లా సియా, నెక్రోటైజింగ్ ఎంటెరోకోలైటిస్, ఇంట్రా వెన్ట్రిక్యులర్ హీమరేజ్ వంటి పెద్ద సమస్యలు ఏవీ రాలేదు.

50 రోజులపాటు ఎన్‌ఐసీయూ సంరక్షణ అనంతరం పసికందు 1.57 కిలోల బరువుతో ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యింది. తల్లి కం గారూ మదర్ కేర్ (కేఎంసీ), పలడై ఫీడింగ్, ఇంటి సంరక్షణ పద్ధతులపై శిక్షణ పొందింది. ఆర్థికంగా భరించలేని కారణంగా, తక్కువ ఖర్చుతోనే ఆసుపత్రి నిర్వహణ మరియు వైద్య బృం దం అండగా నిలిచాయి. పిల్లల వైద్యులు, నయోనటాలజీ టీమ్ కృషితో, ఆసుపత్రి మేనేజ్మెంట్ సహకారంతో పసికందు ప్రాణం దక్కింది.