27 May, 2026 | 1:45 AM

ఏసీబీకి చిక్కిన వడ్డేపల్లి సర్వేయర్

27-05-2026 12:33 AM

అలంపూర్ మే 26: ఓ రైతుకు చెందిన 4 ఎకరాల 14 గుంటల వ్యవసాయ భూమిని సర్వే చేయడానికి లంచం డిమాండ్ చేస్తూ మండల సర్వేయర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు మంగళవారం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వివరాలు వెల్లడించారు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తాహాసిల్దార్ కార్యాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న బ్రహ్మయ్య కొంకల గ్రామానికి చెందిన రైతుకు చెందిన మొత్తం 4.14 గుంటల వ్యవసాయ భూమిని సర్వే చేయడానికి ఎకరాకు రూ. 5000 చొప్పున మొత్తం రూ.2,0000 ఇవ్వాలని రైతుని డిమాండ్ చేశాడు.

అడ్వాన్సుగా రూ.5,000 తీసుకున్నాడు .మొత్తం డబ్బులు ఇస్తేనే సర్వే చేస్తానని మొండికి వేయడంతో రైతు ఏసీబీ అధికారులను సమాచారం ఇచ్చాడు.ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో పక్క సమాచారంతో వెళ్లిన బృందం రైతు నుంచి పదివేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని నాంపల్లి ఏసీబీ కోర్టు తరలించినట్లు డిఎస్పీ బాలకృష్ణ తెలిపారు.