27 May, 2026 | 2:06 AM

పోలీస్ స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

27-05-2026 12:31 AM
  1. బెల్లంపల్లిలో ఘటన 
  2. సీపీ పర్యటనలో అపశృతి
  3. పోలీసుల మెడకు అప్పు గొడవ

బెల్లంపల్లి, మే 26 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తాళ్ళ గురజాల పోలీస్ పోలిస్టేషన్ ఆవరణలో ఓ మహిళా అహ్మహత్య యత్నం ఘటన కలకలం రేపింది. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం తాళ్ళ గురజాల పోలిస్టేషన్ తనిఖీ చేసివెళ్ళిన కొన్ని క్షణాల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చిన్న భూద గ్రామానికి చెందిన గుంపుల లక్ష్మణ్, భాగ్యలక్ష్మి దంపతులు అదే గ్రామానికి చెందిన బియ్యాల పోషం నుంచి నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సురేందర్ అనే వ్యక్తి అప్పుగా తీసుకున్న రూ. 5 లక్షలకు మధ్యవర్తులుగా జమనాథ్ పడ్డారు. అప్పు చెల్లింపు జరుగగా వడ్డీ మాత్రం పెండింగులో ఉంది.

ఈ విషమంలో కొంతకాలంగా వారి మద్య గొడవలు జరుగుతున్నాయి. అవికాస్త తీవ్ర రూపం దాల్చాయి. అప్పుకు వడ్డీని సురేందర్ వడ్డీ చెల్లించకపోవడంతో మద్యవర్తులు గుంపుల లక్ష్మణ్ కు బియ్యాల పోషం మధ్య గొడవలు పెరిగిపోయాయి. వడ్డీ చెల్లించకపోవడంతో మద్య వర్తిగా ఉన్న గుంపుల లక్ష్మణ్ కు చెందిన ట్రాక్టర్ ను బియ్యాల పోషం ఇటీవలనే బలవంతంగా తీసుకెళ్లాడు. వడ్డీ కింద ట్రాక్టర్ ను ఇంట్లో పెట్టుకున్నాడు. వడ్డీ చెల్లిస్తేనే ట్రాక్టర్ ఇస్తానని కండిషన్ పెట్టాడు. తమ అనుమతి లేకుండా ఇంట్లో చొరబడి ఇంటి ప్రధాన గేటు తాళం పగులకొట్టి ట్రాక్టర్ ఎత్తుకెళ్లాడని పోషం పై ఏప్రిల్ 15 న గుంపుల లక్ష్మణ్ తాళ్ళ గురీజాల పోలీస్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు.

పోలీసులు రిషిప్ట్ కూడా ఇచ్చారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే పోలీసులు ట్రాక్టర్ ను పోషం నుంచి స్వాధీనం చేసుకుని పోలిస్టేషన్ కు తరలించారు. ఇప్పటివరకూ బాగానే ఉంది. పోషం పై కేసు నమోదుపై పోలీసుల నిర్లక్ష్యం బాధితురాలు ఆత్మహత్య యత్నం వరకూ వచ్చింది. అంతేకాకుండా వడ్డీ రూ.2 లక్షల 20 వేలు చెల్లించి ట్రాక్టర్ తీసుకువెళ్ళమని పోలీసులు ఒప్పంద పత్రం రాయించారు. అందుకు అంగీకరించమని సంతకాల కోసం బాధితుల్ని పోలీసులు ఒత్తిడి చేసి వివాదంలో ఇరుకున్నారు.

తామేందుకు వడ్డీ చెల్లించాలని, అప్పు తీసుకున్న సురేందర్ పై కేసు నమోదు చేయాలి. అలా కాకుండా పోలీసులు తమపై ఇలా ఒత్తిడి చేయడం, ఇబ్బందులో పేట్టడంపై సీపీ అంబర్ కిషోర్ ఝా ను కలసి తమ గోడును చెప్పుకుందామని బాధితులు గుంపుల లక్షణ్, భాగ్యలక్ష్మి స్టేషన్ కి వచ్చారు. అది ఫలించకపోతే ఆత్మహత్యకు సన్నద్దoతో వెంట పురుగుల మందు డబ్బా కూడా తెచ్చుకున్నారు. అప్పటికే సీపీ అంబర్ కిషోర్ ఝా పోలిస్టేషన్ తనిఖీ చేసి వెళ్లి పోయారు.

ఇదే క్రమంలో గుంపుల లక్ష్మణ్, భాగ్యలక్ష్మి పోలీసు స్టేషన్ కు వచ్చి మెట్ల మీద కూర్చుని పోలీసులతో వాదనకు దిగారు. వాదిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. పోలీసులకు గోడును విన్నవిస్తూనే క్షణికావేశంలో భాగ్య లక్ష్మీ పురుగుల మందును తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న మహిళా పోలీసులు ఆమె ప్రయత్నాలను అడ్డుకున్నారు. అప్పటికే కొంత మేరకు పురుగుల మందు తగినట్టు పోలీసులు గ్రహించారు. ఆమె చేతిలోనీ పురుగుల మందు డబ్బాను పోలీసులు లాక్కొని వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యులు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు పంపించారు. సివిల్ కేసులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఈ కేసు పోలీసులు మెడకు చుట్టుకున్నది.