28 June, 2026 | 1:48 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

లక్ష్మీ సాహితిని సన్మానించిన వజినేపల్లి చక్రవర్తి

01-04-2025 07:38 PM

వైరా (విజయక్రాంతి): వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన సంగేపు వెంకటేశ్వర్లు కవితా దంపతుల కుమార్తే సంగేపు లక్ష్మీ సాహితీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 లో 129వ ర్యాంకు సాధించడం పట్ల వైరాకు చెందిన వజినేపల్లి చక్రవర్తి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం వారి ఇంటికి వెళ్లి గ్రూప్-1 ర్యాంకర్ లక్ష్మి సాహితీని శాలువాతో ఘనంగా సన్మానించి  అభినందించారు. ఈ సందర్భంగా వజినేపల్లి చక్రవర్తి లక్ష్మీ సాహితికి స్వీట్ తినిపించి మరేన్నో ఉన్నత శిఖరాలు అవరోదించాలని ఆకాంక్షించారు. ఆ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.