26 August, 2026 | 1:25 AM

బాసర ఆర్జీయూకేటీలో ఆన్లైన్ సేవలు

26-08-2026 12:00 AM

భైంసా ఆగస్టు 25 ( విజయ క్రాంతి): రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాల యం త్రిబుల్ ఐటీ బాసర ప్రాంగణం వి ద్యార్థుల కోసం ‘ఆర్జీయూకేటీ హబ్’ ద్వారా నూతన ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీ సుకొచ్చినట్టు వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ తెలిపా రు. ధ్రువపత్రాల సేవల కోసం దూర ప్రాం తాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి వచ్చే విద్యార్థులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుం ది, అలాగే విద్యార్థినీల సురక్షతకు ఈ సేవలు ఉపయోగకరంగా ఉంటాయి.

విశ్వవిద్యాలయానికి నేరుగా రావలసిన అవసరం లేకుం డా సర్టిఫికేట్లకు దరఖాస్తు చేసుకోవడం నుం డి పొందే వరకు ప్రక్రియను అత్యంత సులభంగా, వేగవంతంగా పూర్తి చేయడానికి ఈ డిజిటల్ విధానాన్ని ప్రారంభించారు.ఈ నూ తన విధానంలో రెండు ముఖ్యమైన ఆన్లైన్ సేవలను చేర్చారు. మొదటిది ‘ఆన్లైన్ నో-డ్యూ సర్టిఫికేట్’. దీని ద్వారా విద్యార్థులు లై బ్రరీ, క్రీడల విభాగం, ల్యాబ్లు, హాస్టల్, చీఫ్ వార్డెన్ కార్యాలయం, స్కాలర్షిప్, ఫైనాన్స్, పూర్వ విద్యార్థుల విభాగాల నుండి పొందాల్సిన క్లియరెన్స్ ప్రక్రియను డిజిటల్ పద్ధతి లోనే దరఖాస్తు చేసుకుని పరిశీలించుకోవచ్చు.

రెండవది ‘ఆన్లైన్ సర్టిఫికేట్ రిక్వెస్ట్’. ఈ సేవల కింద బోనాఫైడ్, కండక్ట్, బదిలీ ప్ర మాణపత్రం, కస్టోడియన్, గ్రేడ్ కార్డ్, ట్రా న్స్క్రిప్ట్, మార్కుల మెమో, మైగ్రేషన్, ప్రో విజనల్, డిగ్రీ సర్టిఫికేట్లు, నకిలీ ధ్రువపత్రాల కోసం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవ చ్చు. విద్యార్థులు రుసుమును ఆన్లైన్లో చెల్లిం చి, ధ్రువపత్రాలను పోస్ట్ ద్వారా లేదా నే రుగా వచ్చి తీసుకునే సౌకర్యాన్ని ఎంచుకోవ చ్చు. దరఖాస్తు ఏ దశలో ఉందో ప్రత్యక్షంగా తెలుసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

ప్రాథమికంగా, ప్రస్తుతం ఉత్తీర్ణులైన B 20 బ్యాచ్ విద్యార్థులను వాళ్ళ యొక్క ప్ర యోజనాలను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రాధాన్యత ఇస్తూ, వారి బ్యాచ్ తోనే ఈ సేవలు ప్రారంభించారు. త్వరలోనే మిగిలిన బ్యాచ్ల విద్యార్థులకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు. ఇదివరకే భౌతికంగా  ధ్రువ పత్రాల కోసం దరఖాస్తులు సమర్పించిన విద్యార్థులు మళ్లీ ఆన్లైన్లో దరఖాస్తు చేయనవసరం లేదు, వారి పాత దరఖాస్తులను య థావిధిగా పరిశీలించి ధ్రువపత్రాలు అందజేస్తారు.

విద్యార్థులు [https://hub2.rguk t.ac.in] (https://www.google.com/ search?q=https://hub2.rgukt.ac.in) వ్బుసైట్లో తమ ఐడీ వివరాలతో లాగిన్ అ యి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి పేజీలో వి వరణాత్మక గైడెన్స్ మ్యాన్యువల్ అందుబాటులో ఉంటుంది. సందేహాలు లేదా సాంకేతి క సాయం కోసం పరీక్షల విభాగాన్ని సంప్రదించవచ్చు లేదా techsupport@rgu kt.ac.in ద్వారా సేవలు పొందవచ్చు.