టీఈజేఏసీ ధర్నాను విజయవంతం చేయండి
చేగుంట ఆగస్ట్ 25: తెలంగాణ జెఏసి ఆధ్వర్యంలో ఆగస్ట్ 27న మెదక్ జిల్లాలొ నిర్వహిస్తున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని మండల టిఈజేఏసి నాయకులు పిలుపునిచ్చారు, మండలంలోని, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల, నాయకులు ఇట్టి ధర్నాలొ పాల్గొని విజయవంతం చేయాలని మంగళవారం భోజన విరామం సమయంలో మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పిఆర్సి ప్రకటించి, వెంటనే అమలు పరచాలని, పెండింగ్ డి ఏ లను విడుదల చేసి, జీవో 317 ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, సీపీఎస్ రద్దు చేసి, ఓ పి ఎస్ అమలు చేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో టీ జెసి నాయకులు, తాసిల్దార్ బాల లక్ష్మి, ఎంపీడీవో సిబ్బంది విజయ్, టిఆర్టిఎఫ్ అధ్యక్షులు జగన్ లాల్ , యుటిఎఫ్ అధ్యక్షులు బాల పోచయ్య, ఎస్ టి యు అధ్యక్షులు పెంట గౌడ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






