8 July, 2026 | 5:05 PM

Breaking News

ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •  

ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

06-08-2025 10:19 PM

పాల్గొన్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలో బుధవారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఎక్సైజ్ సూపర్డెంట్ హనుమంతరావు, కామారెడ్డి ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ, ఎక్సైజ్ ఎస్ఐ ఎస్ఐ విక్రమ్ ల ఆధ్వర్యంలో, టిసిఎస్ నెంబర్.1 కామారెడ్డి అధ్యక్షులు బండారి రాజా గౌడ్, సంఘసభ్యుల గీత కార్మికు లు వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఈత మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి మాట్లాడుతూ, కలితికి తావు లేకుండా ఈత వనాలను పెంచి మంచి నాణ్యత గల కల్లు గీత కార్మికులు విక్రయించాలని కోరారు. ఈ  కార్యక్రమంలో కామారెడ్డి టిసిఎస్ నెంబర్ 1, మాజీ అధ్యక్షులు బిబిపేట్ చంద్రం గౌడ్, డైరెక్టర్లు నాళం శ్రీధర్ గౌడ్, శివరాం ప్రదీప్ గౌడ్, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోడి ప్యాక బాలరాజు గౌడ్, సంఘ సభ్యులు జీవన్ గౌడ్, కంచర్ల నర్సా గౌడ్, తిరుమల అనిల్ కుమార్ గౌడ్, నాడం రాజా గౌడ్, గీత కార్మికులు పాల్గొన్నారు.