06-08-2025 10:22:39 PM
గోవాలో ప్రజా యుద్ధనౌక ఘనంగా గద్దర్ వర్ధంతి వేడుకలు..
నివాళులర్పించిన బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ..
మునుగోడు (విజయక్రాంతి): తన తుది శ్వాస వరకు ప్రజల పక్షాన నిలిచిన ఉద్యమ స్ఫూర్తి ప్రజాయుద్ధనౌక గద్దరని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ(State Secretary Anaganti Krishna) అన్నారు. బుధవారం ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతి గోవాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. తెలంగాణ సాంస్కృతిక, విప్లవ రథసారధి గాయకుడు ప్రజాయుద్ధ నౌక గద్దర్ తన ఆట పాటలతోటి సమాజాన్ని చైతన్యపరిచి చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన నిలిచి తరతరాలకు ఉద్యమస్ఫూర్తి అందించిన పోరాట పొలికేక ప్రజాయుద్ధ నౌక గద్దర్ వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నరసింహ, గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి సంఘం కార్యదర్శి అనంతుల సాయి, గోస్కొండ కృష్ణయ్య, మహిళా సంఘం నాయకులు,బీసీ సంఘం నాయకులు ఉన్నారు.