06-08-2025 10:16:41 PM
చేవెళ్ల: తెలంగాణ ఏర్పాటులో మాజీ బీజేపీ లోక్ సభ పక్ష నేత సుష్మా స్వరాజ్ పాత్ర మరువలేనిదని చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డి(Municipal President Attelli Anantha Reddy) కొనియాడారు. బుధవారం సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుష్మా స్వరాజ్ తెలంగాణ ఉద్యమ సమయంలో చిన్నమ్మ పాత్ర పోషించి.. రాష్ట్ర ఏర్పాటుకు పూర్తిగా సహకరించారని గుర్తుచేశారు. తుది శ్వాస వరకు కూడా బీజేపీ కోసం కష్టపడ్డారని, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ చేవెళ్ల రూరల్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు శర్వలింగం, జైశంకర్, చీర శ్రీనివాస్, కుంచం శ్రీనివాస్, పత్తి సత్యనారాయణ అశోక్, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, శివ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, మధుకర్ రెడ్డి రవి, శంకర చారి, పాగా వెంకటేశ్, బాల్ రెడ్డి, గోవర్ధన్, కృష్ణమోహన్, గణేష్ , ప్రకాశ్, దామోదర్, యదయ్య, రాఘవేందర్ రెడ్డి, రమేశ్, జైసింహా రెడ్డి , రాఘవేందర్, వెంకటేశ్ పాల్గొన్నారు.