ఆలేరు ఇండోర్ స్టేడియంలో వనమహోత్సవం మాస్ ప్లాంటేషన్
ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆలేరు పురపాలక సంఘం పరిధిలోని ఇండోర్ స్టేడియం ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, పుర ప్రముఖులు కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, ప్రజల్లో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షిస్తూ వాటి పెరుగుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్‌పర్సన్ బీజన బాలమణి, మున్సిపల్ కమిషనర్ కె. శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అంగిడి ఆంజనేయులు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, ఆర్‌పీలు, పుర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






