26 August, 2026 | 1:12 AM

జీఎంపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా వినయ్ యాదవ్

25-08-2026 11:52 PM

జాజిరెడ్డిగూడెం,(అర్వపల్లి): తెలంగాణ గొర్రెల,మేకల పెంపకం దారుల సంఘం(జీఎంపీఎస్)రాష్ట్ర కమిటీ సభ్యునిగా మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన వజ్జె వినయ్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో జరిగిన ఆ సంఘం రాష్ట్ర 4వ మహాసభల్లో వినయ్ యాదవ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెల, మేకల పెంపకం దారులకు 50శాతంపై సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని,559 జీవోను పూర్తిస్థాయిలో అమలు పరిచి, 50 సంవత్సరాలు నిండిన కాపర్లకు రూ.5వేల పెన్షన్ అందజేయాలని అన్నారు.వివిధ కారణాలతో చనిపోయిన కాపారులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషీయాను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర,జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.