26 August, 2026 | 1:13 AM

పన్నూర్‌లో ఘనంగా వనమహోత్సవం – మాస్ ప్లాంటేషన్

25-08-2026 11:55 PM

రామగిరి,(విజయక్రాంతి): రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పర్యావరణ పరిరక్షణ కోసం వనమహోత్సవం (మాస్ ప్లాంటేషన్) కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ చిందం మహేష్  ఆధ్వర్యంలో, రామగిరి మండలం ఎంపీడీఓ శ్రీమతి బి. శైలజ రాణి  భాగస్వామ్యంతో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన, స్ఫూర్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.

మొక్కలు నాటడం ద్వారా పాఠశాల ఆవరణ మరింత పచ్చదనంతో, ఆహ్లాదకరమైన వాతావరణంగా మారనుంది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రేమలత, ఉప సర్పంచ్ కావేటి మల్లేశ్వరి, వార్డు సభ్యులు చేతి సుధాకర్, విజయ్ ప్రదీప్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ప్రిన్సిపాల్, విద్యార్థులు, పన్నూర్ గ్రామపంచాయతీ సిబ్బంది,  ఏఎన్ఎం,లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.