calender_icon.png 8 December, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందేమాతరం నినాదం.. బ్రిటిషర్లకు సింహస్వప్నం

08-12-2025 01:04:59 PM

దేశ ఐక్యతకు చిహ్నం వందేమాతరం

న్యూఢిల్లీ: వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై(Vande Mataram Lok Sabha Discussion) లోక్ సభలో సోమవారం చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సభలో చర్చను ప్రారంభించారు. జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏడాది పొడవునా వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. వందేమాతరం.. స్వాతంత్య్ర పోరాటంలో(Freedom Struggle) భారతీయుల గొంతు అన్న ప్రధాని మోదీ ఈ చర్చలో పాల్గొనడం గర్వకారణం అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వివరించారు. ఇవాళ్టి చర్చలు భవిష్యత్తు తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని సూచించారు. వందేమాతరం అనేది ఒక మంత్రం.. స్వాతంత్య్ర ఉద్యమానికి వందేమాతరం.. శక్తి, ప్రేరణ ఇచ్చిందని తెలిపారు. 1857 తర్వాత స్వాతంత్య్ర సమరయోధులపై ఒత్తిడి పెంచారు.. ఒత్తిడి పెరిగినా వెనక్కి తగ్గకుండా వందేమాతరం రచించారని కొనియాడారు.

దేశ ఐక్యతకు చిహ్నంగా వందేమాతరం నిలిచిందన్నారు. దేశాన్ని అనేక ముక్కలు చేసేందుకు ఆంగ్లేయులు శత విధాలా ప్రయత్నించారని, భారత్ అనేక ముక్కలు కాకుండా వందేమాతరం నినాదం(Vande Mataram Slogan) సాయం చేసిందన్నారు. బెంగాల్ ఐక్యతకు వందేమాతర గేయం పాత్ర ఎనలేనిదని ప్రధాని గుర్తుచేశారు. స్వాతంత్య్ర ఉద్యమం ప్రతి సమయంలో వందేమాతరం వినిపించిందన్నారు. వందేమాతర నినాదం.. బ్రిటిషర్లకు సింహస్వన్నంగా మారిందని మోదీ స్పష్టం చేశారు. భారత్ నలువైపులా వందేమాతర నినాదం మారుమోగిందన్నారు. మాతృభూమి దాస్య శృంఖలాలు తెంచేందుకు కీలకంగా మారిందన్నారు. వందేమాతరం గేయంపై ప్రధాని మోదీ కవితలు వినిపించారు.

వందేమాతరం.. ఆజాద్ భారత్(Azad Bharat) కు విజన్ గా మారిందన్నారు. పాలనలో భారతీయుల శక్తి సామార్థాలపై సందేహం వెలిబుచ్చారని, కష్టసమయంలో ప్రజలకు దారిదీపంగా వందేమాతరం నిలిచిందని తెలిపారు. మనదేశం జ్ఞానం, సమృద్ధికి మారుపేరు అన్నారు. వందేమాతరం గేయం.. శత్రువుల చెవుల్లో మారుమోగిందని వ్యాఖ్యానించారు. వందేమాతరం నినాదాలు వినలేక ఆంగ్లేయుల దారుణాలకు ఒడిగట్టారన్నారు. దేశంలో అనేకచోట్ల ఉద్యమకారులను కఠినంగా అణచివేశారని తెలిపారు. వందేమాతరం నినాదాలు చేస్తూ ఎందరో ప్రాణాలు ఆర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉరిశిక్ష అమలు చేసే ముందూ వందేమాతరం నినాదాలు చేశారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.