08-12-2025 11:46:17 AM
రాయ్‌పూర్: మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) మరో పన్నెండు మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆయుధాలతో సహా మావోయిస్టులు(Maoists Surrender) ఖైరాఘర్ జిల్లా పోలీసులు ఎదుట సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్(Central Committee Member Randher) ఉన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్ తలపై రూ. 3 కోట్ల రివార్డు ఉంది. రాంధెర్ ఎంఎంసీ జోన్ లో క్రియాశీలకంగా ఉన్నాడు. రాంధెర్ మిళింద్ తెల్టుంబే మరణించాక ఎంఎంసీ బాధ్యతలు చూస్తున్నారు. రాంధెర్ లోంగుబాటుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సరిహద్దులు నక్సల్స్ రహిత ప్రాంతంగా మారాయని అధికారులు తెలిపారు.