4 March, 2026 | 2:39 AM

వరలక్ష్మికి దోశ ఇష్టం.. అందుకే బ్యానర్‌కు ఆ పేరు!

04-03-2026 12:43 AM

వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరస్వతి’. ఈ సినిమాను ఆమె తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి దోశ డైరీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్మాత పూజ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

* నాకు కెమెరా వెనక ఉండడమే ఇష్టం. అసలు యాక్టింగ్ రాదు. నాకు ప్రొడక్షన్‌పై ఆసక్తి ఉంది. కొత్త బ్యానర్‌కు మంచి పేరు పెట్టాలి అనుకున్నప్పుడు ఫుడ్‌తో కనెక్షన్ ఉంటే అందరికీ కనెక్ట్‌గా ఉంటుందనిపించింది. వరలక్ష్మికి దోశ చాలా ఫేవరెట్. ‘దోశ డైరీస్’ ఐడియా అందరికీ నచ్చింది. 

* ‘సరస్వతి’ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్న వన్ ప్యాకేజ్ పటాకా. రెండు గంటల సినిమా ఎంత గ్రిప్పింగా ఉండాలో అంత అద్భుతంగా తీర్చిదిద్దాం.

* ఇదొక క్రైమ్ థ్రిల్లర్. మంచి సోషల్ మెసేజ్ ఉంది. వరలక్ష్మి వ్యక్తిగతంగా బాగా కనెక్ట్ అయిన బలమైన కథ ఇది. శక్తిమంతమైన స్త్రీని ఇందులో చూస్తారు.

* ఇందులో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. ప్రకాశ్‌రాజ్‌తోపాటు ప్రతి క్యారెక్టర్ కథలో కీలకంగా ఉంటాయి. ప్రియమణి పాత్ర గురించి ఇప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు. వరలక్ష్మి మంచి విజన్‌తో ఆ పాత్రను డిజైన్ చేసింది.  

* వరలక్ష్మికి ఇది చాలా ఎమోషనల్ అండ్ ప్రౌడ్ మూమెంట్. పరిశ్రమలో తన జర్నీ చాలా స్ఫూర్తిదాయకం. వరలక్ష్మి ఇప్పుడు హైదరాబాద్ అమ్మాయి అయిపోయింది. తన డైరెక్షన్ చేస్తున్న తొలి సినిమా తెలుగులోనే ఉండాలని తన బలంగా కోరుకుంది. శరత్‌కుమార్ మాకు చాలా సపోర్ట్ చేశారు. సినిమా ఎలా జరుగుతుందని కాల్ చేసి తెలుసుకునేవారు. అవుట్ పుట్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. 

* సినిమాపై మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. మార్చి 5న ఒక ప్రీమియర్ అనుకుంటున్నాం. జనవరి 6న తెలుగులో, తర్వాత మిగతా భాషల్లో విడుదల చేస్తున్నాం.  

* దోశ డైరీస్‌పై మంచి కథలన్నీ నిర్మించాలని ఆలోచన ఉంది. ఈ రోజుల్లో కథ అనేది రెలవెంట్‌గా ఉండాలి. అలాంటి కథల కోసం చూస్తున్నాం. మా సంస్థ నుంచి ఏ జోనర్ సినిమా వచ్చినా, అది బాగుండాలనేదే మా లక్ష్యం. కొత్తగా -కొన్ని స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తున్నాం. ఫైనల్ అవ్వగానే వివరాలు తెలియజేస్తాం.