4 March, 2026 | 4:26 AM

జూమ్ చేసి ఫొటోలు తీస్తారేం?!

04-03-2026 12:45 AM

తమను అసభ్యకరమైన కోణాల్లో చిత్రీకరించడంపై మహిళా నటులకు నచ్చడంలేదు. దీంతో వారు తరచూ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెడుతున్నారు. ఈ ‘జూమ్ ఇన్’ సంస్కృతిపై గతంలోనూ జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహి వంటి స్టార్ హీరోయిన్లు స్పందించారు. తాజాగా ఇదే అంశంమై మరో ముగ్గురు నటీమణులు స్పందించారు. కన్నడ నటి, ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ ఆవేదన వ్యక్తం చేసింది.

తన పోస్టు ‘మేము నటులం.. వస్తువులం కాదు’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇదే అంశంపై ఆషిక రంగనాథ్, రుక్మిణీ వసంత్ కూడా ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు. “మేము ఇక్కడ ఉన్నది మా కళ కోసం, సినిమా కోసం. కానీ కొంతమంది అసభ్యకరమైన కోణాల్లో ఫొటోలు తీస్తూ మమ్మల్ని కించపరుస్తున్నారు. ఇది ఒక వ్యక్తి గౌరవానికి సంబంధించిన విషయం. ఈవెంట్లను కవర్ చేసేవారు వృత్తి నైపుణ్యాన్ని, కనీస మర్యాదను పాటించాలి. ఇలాంటి పనులను మేము అస్సలు సహించం.

ఫిల్మ్ ఇండస్ట్రీ మహిళలంతా గొంతు విప్పాల్సిన సమయం వచ్చింది. ఈ విషయంలో హద్దుల ఏర్పాటు కోసం ఒక్కటిగా నిలబడాలి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న ప్రతి మహిళకు సంఘీభావంగా నిలబడతాం. గౌరవాన్ని అందుకోవ డమే కాదు, ఒకరికొకరం మద్దతుగా నిలుస్తాం. మీడియా మిత్రులు మాకు మద్దతుగా నిలవాలి” అని పేర్కొన్నారు. ముగ్గురు హీరోయిన్లు ఒకేసారి ‘జూమ్ ఇన్’ అంశాన్ని లేవనెత్తడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.