calender_icon.png 19 January, 2026 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలప్రదర్శన చెస్తే టికెట్ ఇవ్వం..

19-01-2026 01:41:28 AM

బీఆర్‌ఎస్ హయంలో అవినీతి

మండలాలో అభివృద్ధి పనులకు 10 కోట్లు.. 

మున్సిపాలిటీలో రూ. 2.90 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు 

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్‌నగర్, జనవరి 18 (విజయక్రాంతి): టికెట్ల కేటాయింపు విషయంలో బల ప్రదర్శన చేసే నాయకుల కన్నా, వార్డులో ఉండి నిరంతరం పనిచేసే వారికే ప్రాధాన్యతను ఇస్తామని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం షాద్ నగర్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశం లో అయన మాట్లాడుతు  మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి రాజకీయాలకు ఆస్కారం ఇవ్వమని, నిజాయితీతో గెలుస్తామని, సత్తా చాటుతామని  అన్నారు. 

టికెట్ల కేటాయింపు విషయంలో బల ప్రదర్శన చేసే నాయకుల కన్నా, వార్డులో ఉండి నిరంతరం పనిచేసే వారికే ప్రాధాన్యతను ఇస్తామని వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ పీఠం ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో నమ్మి అధికార పీఠాన్ని ఇచ్చిన వార్డుల అభివృద్ధికి బీఆర్‌ఎస్ చేసింది ఏమీ లేదని, అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లోనే తాము ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. 

బీఆర్‌ఎస్ హయంలో అవినీతి

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గత మున్సిపాలిటీ పాలకులు ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు.. పట్టణ ప్రజలకు తెలుసని అన్నారు. ముఖ్యంగా గత పాలకుల మాదిరిగా తమ ప్రభుత్వం హయాంలో ఎవరి ఇండ్లు కూలగొట్టమని, ఎవరి వద్ద డబ్బులు వసూలు చేయమని, కంకర పోసి కమిషన్లు అడగమని అన్నారు. నిష్పక్షపాతమైన ప్రజా పరిపాలన అందిస్తామని వసూళ్లకు పాల్పడేవారిని ఉపేక్షించమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నిజాయితీగా ప్రజాసేవకు కట్టుబడిన వారికి మాత్రమే కాంగ్రెస్ బిఫారమ్స్ ఇస్తామని ఎమ్మెల్యే  స్పష్టం చేశారు. 

మండలాలో అభివృద్ధి పనులకు 10 కోట్లు.. 

మున్సిపాలిటీలకు ప్రగతి వెలుగులు తెచ్చేందుకు రూ.2.90 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని వార్డులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మంజూరైన నిధులతో పట్టణంలోని ఒకటవ వార్డులో రూ. 42 లక్షలతో రెండు సిసి రోడ్లు, రెండవ వార్డులో రూ. లక్షతో కాలువ నిర్మాణం, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మీదుగా సిసి రోడ్డు, 9వ వార్డులో 35 లక్షలతో సిసి రోడ్డు, పదో వార్డులో 15 లక్షలతో మరో సిసి రోడ్డు, 14 18 వార్డుల్లో 31 లక్షలతో రెండు సిసి రోడ్లు, 22వ వార్డులో పది లక్షలతో మరో సిసి రోడ్డు, 27వ వార్డులో ఏడు లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

షాద్ నగర్ నియోజకవర్గంలోని మూడు మండలాలకు అభివృద్ధి పనుల నిమిత్తం 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినట్లు అయన తేలిపారు. కొత్తూరు మండలంలో తిమ్మాపూర్ నుంచి నానాజీపూర్ మీదుగా గూడూరు వరకు బిటి రోడ్డు ను రూ.5.75 కోట్లతో నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా కేశంపేట మండలంలో గ్రామస్తులు ఎప్పటి నుంచి అడుగుతున్న వంతెన నిర్మాణాన్ని 2.25 కోట్లతో చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఇక కొందరుకు మండలంలో ఆగిరియాల ఎస్సీ కాలనీ నుంచి కొల్లూరు వరకు రహదారి నిర్మాణానికి రెండు కోట్ల కేటాయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమ్ లో నేతలు మహమ్మద్ అలీ ఖాన్ బాబాయ్, అగునూరు విశ్వం, రఘు నాయక్, అగునూరు బస్వం, అందే మోహన్ కొందురు మండలం పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నందిగామ మండల పార్టీ అధ్యక్షుడు జంగా నరసింహా యాదవ్, కొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, కేశంపేట మండల పార్టీ అధ్యక్షుడు వీరేష్, పాటిగడ్డ సర్పంచ్ అఖిల్, నిద్ర వెళ్లి సర్పంచ్ భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.