calender_icon.png 19 January, 2026 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు

19-01-2026 01:38:32 AM

మొయినాబాద్, జనవరి 18(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవి్ంప కఠిన చర్యలు తీసుకుంటున్నామని మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. సీఐ పవన్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించి బ్రెత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా రాంగ్ రూట్లో వాహనాలు నడిపే వారిపై కూడా జరిమానాలు విధిస్తూ వాహనాలు సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని, ప్రజలు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. ప్రత్యేకించి యువత రాంగ్ రూట్ డ్రైవింగ్కు దూరంగా ఉండాలని, హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సీఐ పవన్ కుమార్ రెడ్డి సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు.