వరుణ్ చక్రవర్తికి మళ్లీ గాయం
అఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు దూరం
ఆసియా క్రీడలకు అనుమానమే
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: అఫ్ఘనిస్తాన్‌తో టీ ట్వంటీ సిరీస్ జరుగుతుండగా భారత్ జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Spinner Varun Chakravarthy) మళ్లీ గాయపడ్డాడు. ఫలితంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. తొలి టీ20 మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసి భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం వరుణ్ చక్రవర్తి గాయపడినట్టు తేలడంతో సిరీస్‌కు దూరమయ్యాడు.
ఈ ఏడాది వరుణ్ చక్రవర్తిని వరుస గాయాలు వెంటాడుతున్నా యి. ఐపీఎల్ 2026 సమయంలో కాలి బొటనవేలు విరగడంతో ఐర్లాండ్ పర్యటనకు దూ రం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చినా, తొ డ కండరాల గాయం కారణంగా మూడో మ్యాచ్ తర్వాత మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సుదీర్ఘ పునరావాసం పూర్తి చేసుకుని దేశీయ క్రికెట్ లో ఫిట్ నెస్ నిరూపించుకున్న తర్వాతే వ రు ణ్ చక్రవర్తి ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. తొలి టీ ట్వంటీ తర్వాత అతడికి కొ త్తగా గాయం అయినట్టు తెలుస్తోంది. తాజా గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి ఆసియా క్రీడలకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.