15 August, 2026 | 4:57 PM

ఘనంగా వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి

27-04-2026 12:00 AM

అమ్మవారి కానుకగా మహిళలకు చీరె సారెలు అందజేత

జవహర్‌నగర్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): మల్కాజిగిరిమున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్  జవహర్ నగర్ శ్రీరాంనగర్ కాలనీలో జవహర్ నగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చిరంజీ రవీందర్ గుప్త నేతృత్వంలో నిర్మించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జయంతి ఉత్సవ కార్యక్రమాలను ఆదివారం పండుగ వాతావరణంలో  ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు రవి గుప్తా హాజరై మాట్లాడుతూ విశ్వ జనని ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జయంతి వేడుకలను పురస్కరించుకొని నానా విధమైన పూలతో పచ్చని ఆకుల తోరణాలతో విద్యుత్ దీపాలతో సుందరంగా ఆలయ ప్రాంగణాన్ని అలంకరించి వేద పండితుల మంత్రోచ్ఛరణలు అష్టోత్తర శత నామాలు వందలాది భక్తుల ఓంకార జయకారాలు ఓం శ్రీ మాత్రే నమః అనే భక్తి పరవశ్యత గల నామస్మరణల మధ్య నానా విధముల ద్రవ్యాలు పుష్పాలతో అభిషేక పూజలు హారతి సేవలను అమ్మవారికి అర్పించడం పూర్వజన్మల సుకృతం అని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి బద్రిష్ గుప్తా, కోశాధికారి పైడి రమేష్ గుప్తా, ఉప కోశాధికారి గట్టు చంద్రశేఖర్ గుప్తా, సలహాదారులు బెజగం రాజేశం గుప్తా, తదితరు లు పాల్గొన్నారు.