ప్రతి కాలనీ వాసుల సమస్యను పరిష్కరిస్తాం
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో పార్కులను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ ఎస్బిహెచ్ కాలనీలో ఎదుర్కొంటున్న సమస్యలపై కాలనీవాసులు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీలో స్థానిక నాయకులతో కలిసి సందర్శించి పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడు తూ డివిజన్ లో వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా డివిజన్లోని ఈశ్వరమ్మ బస్తీలో బస్తీ వాసుల వినతి బస్తీలో ఇంటింటికి తిరుగుతూ బస్తీ వాసులు ఎదుర్కొంటున్న కలుషిత నీటి సమస్యను జలమండలి అధికారు లతో చర్చించి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకుడు ముఠా జై సింహ, స్థానిక డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సాయి కృష్ణ, సీనియర్ నాయకుడు వల్లల శ్రీనివాస్ యాదవ్, ఆర్. రాజేష్, ముషీరాబాద్ మీడియా ఇన్ఛార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, కాలనీవాసులు డిజి. కృష్ణంరాజు, సంగమేశ్వర రావు, జితేందర్, వర్మ, జితేందర్ కుమార్, ప్రణీత్ కుమార్, హరీష్, రాజశేఖర్ గౌడ్, సతీష్, శివ లాల్, మహేష్, సందీప్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.






