27 April, 2026 | 1:50 AM

ఘనంగా వాసవీ మాత జయంతి

27-04-2026 12:00 AM
  1. అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషదాయకం
  2. సీఎం రేవంత్‌కు ఆర్యవైశ్య అధ్యక్షుడు ఉప్పల కృతజ్ఞతలు

నాగోల్, ఏప్రిల్ 26(విజయక్రాంతి): వాసవి మాత జయంతిని ప్రభుత్వం అధికారికం చేయడంతో 25 లక్షల మంది ఆర్య వైశ్యుల తరు పున సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త కృతజ్ఞతలు తెలిపారు. అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించుకోవడం సంతోషదాయకమన్నారు.

ఆర్య వైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు సర్వలోకాలకు కలగాలని, ప్రజలంద రికీ సుఖశాంతులు, ఐశ్వర్యాలు చేకూరాలని గుప్త ప్రార్థించారు. వాసవి మాత జయంతి సందర్భంగా సికింద్రాబాద్, మియాపూర్, ప్రగతి నగర్, గాజులరామారం, నర్సాపూర్, మగ్దూమ్‌నగర్ (హెచ్‌ఎంటీ), బాచుపల్లి, రాంపల్లి ప్రాంతాల్లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.

ఈ సందర్భంగా ఉప్పల మాట్లాడుతూ ఎన్నోఏళ్ల ఆకాంక్ష ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడమన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, పరస్పర గౌరవం పెంపొందించడానికి అమ్మవారి బో ధనలు మార్గదర్శకంగా నిలుస్తాయని, యు వత ఆధ్యాత్మిక, సాంప్రదాయ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచిం చారు.

జయంతి వేడుకల్లో ఆయా ప్రాంతా ల్లో భక్తులకు అన్నదానం, ప్రసాదాల పంపి ణీ చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో  పబ్బా చంద్రశేఖర్, కట్టా రవికుమార్, కటకం శ్రీనివాస్, బీ రవికుమార్, నవీన్, ఆర్య వైశ్య సంఘం నాయకులు, వాసవి సేవా సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.