పదో తరగతిలో విద్యార్థుల ప్రతిభ
నిర్మల్,(విజయక్రాంతి): స్థానిక నిర్మల్ జిల్లాలోని వాసవి పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో 2025- 26 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభను సాధించారు. మొత్తం 31 1మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 271 మంది విద్యార్థులకు 550 కి పైగా మార్కులు సాధించడం విశేషం. 587 మార్కులు ఇద్దరు,580 కి పైగా 15 మంది విద్యార్థులు, 570కి పైగా 43 మంది విద్యార్థులు, 560 కి పైగా 82 మంది విద్యార్థులు, 550 కి పైగా1 28 విద్యార్థులు విద్యార్థులు తమ ప్రతిభను చాటారు.
ఈ ఫలితాలలో వాసవి పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించి మరోసారి తన ప్రతిభను నిరూపించుకుంది.ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకుపాఠశాల యాజమాన్యం అభినందనలు తెలియజేస్తూ విద్యార్థులకు శాలువాతో సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఇంకా విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కరస్పాండెంట్ పోతా రెడ్డి గారు, సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి గారు ,ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ శెట్టి, రాజకుమార్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






