29 April, 2026 | 10:25 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే యువత భవిష్యత్తు సురక్షితం

29-04-2026 08:55 PM

ఎస్ఐ చలికంటి నరేష్

గరిడేపల్లి,(విజయక్రాంతి): డ్రగ్స్ దూరంగా ఉంటే యువత భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని ఎస్ఐ చలికంటి నరేష్ అన్నారు.మండల కేంద్రంలో గరిడేపల్లి లో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీసులు బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

తాత్కాలిక ఆనందం కోసం మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఆరోగ్యం, చదువు, కుటుంబ భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. డ్రగ్స్‌కు బానిసైన యువత నేరాల బాట పట్టే ప్రమాదం ఉందని తెలిపారు. సమాజాన్ని మత్తు పదార్థాల బారినుంచి కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.డ్రగ్స్ విక్రయాలు, వినియోగంపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు,  డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది సుంకరి నగేష్,గోపి, ప్రశాంత్,మల్లయ్య,షబ్బీర్,  తదితరులు పాల్గొన్నారు.